![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 10:11 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని రాజోలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారులు ఉపాధ్యాయులుగా మారి, తరగతి గదిలో తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. టీచర్స్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా నిఖిత, ఉపాధ్యాయలు బృందం భానుప్రియ, అలేఖ్య, సింధుజలు పాల్గొన్నారు.