|
|
by Suryaa Desk | Mon, Mar 10, 2025, 08:11 PM
మార్చి నెల ప్రారంభం నుంచే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉయదం పూట 8 గంటలు దాటగానే సూర్యుడు యాక్షన్‌లోకి దిగిపోతున్నాడు. ఎండల తీవ్రత ఓ రేంజ్‌లో ఉండటంతో రోడ్ల వెంట బండ్లు పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు అల్లాడిపోతున్నారు. ఇక స్కూళ్లకు వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఓ పక్క ఎండ.. మరోపక్క ఉక్కపోతతో అల్లడిపోతున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఈసారి కాస్త ముందుగానే ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.అయితే.. ఇప్పటికే రంజాన్ పండుగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లకు విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమైయ్యాయి. అయితే మార్చి 15 నుంచి అన్ని స్కూళ్లకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఇలాగే స్కూళ్ల టైమింగ్స్ కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం పూట స్కూళ్లు జరుగుతాయి.