|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:07 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో సమావేశం నిర్వహించడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి విదేశాల్లో ఉన్న సమయంలో పరిపాలన అంశాలపై మంత్రులు సమావేశం కావడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి రాష్ట్ర పరిపాలన విషయమై సమావేశం నిర్వహించి ఉంటారని తాము భావిస్తున్నామని చెప్పారు.ఢిల్లీలో నిన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పీసీసీ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.