|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:34 PM
మహబూబాబాద్ జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్ మండలం బలరాంతండాలో ఓ మహిళ కళ్ల ముందే ఆమె భర్త, కుమారుడు మృతి చెందారు. కేలోత్ మదన్ తన భార్య అనిత, కుమారుడు లక్షిత్‌తో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. మదన్ ట్రాక్టర్‌తో భూమిని దున్నిన అనంతరం కుమారుడితో కలిసి భోజనం చేశారు.ఆ తర్వాత కుమారుడిని పొలంలోని భార్య వద్దకు తీసుకువెళ్లేందుకు భుజాలపై ఎత్తుకుని వెళుతుండగా, బాలుడు వ్యవసాయ మోటార్ విద్యుత్తు తీగను పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న బావిలో పడిపోయారు.కళ్ల ముందే భర్త, కుమారుడు విద్యుత్ షాక్‌కు గురై బావిలో పడిపోవడం చూసిన అనిత గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల రైతులు బావి వద్దకు వచ్చేసరికి ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. భర్త, కుమారుడు మృతి చెందడంతో అనిత రోదనలు మిన్నంటాయి. మదన్ మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు. బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.