|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:40 PM
అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు ఇప్పుడు పసి పిల్లల వరకు చేరాయి. మినియాపాలిస్‌లో తన తండ్రితో కలిసి కిరాణా దుకాణం నుంచి తిరిగి వస్తున్న రెండేళ్ల చిన్నారి క్లోయ్ రెనాటాను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) ఏజెంట్లు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. కోర్టు ఆ చిన్నారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించినప్పటికీ, అధికారులు ఆమెను తండ్రితోపాటు విమానంలో టెక్సాస్‌లోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.ఈ ఘటనపై మిన్నియాపాలిస్ సిటీ కౌన్సిల్ సభ్యుడు జేసన్ చావెజ్ తీవ్రంగా స్పందించారు. అధికారుల తీరును కిడ్నాప్‌తో పోల్చారు. ఎటువంటి జుడీషియల్ వారెంట్ లేకుండానే తండ్రి కారు విండో పగలగొట్టి వారిని బలవంతంగా తీసుకెళ్లారని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఈ వాదనను తోసిపుచ్చింది. తండ్రి ఎల్విస్ జోయెల్ అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన నిందితుడని, అరెస్ట్ సమయంలో అతడు సహకరించలేదని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (DHS) పేర్కొంది.