|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:30 AM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్ పరిధిలో ప్రగతి నగర్ త్రీ మంకీస్ చౌరస్తా వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట సర్కిల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ప్రణయ ధనరాజ్ యాదవ్, రాఘవేంద్ర రావు, ఇంద్రాజిత్ రెడ్డి గార్లు విగ్రహ దాత చల్ల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదని, సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.దేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన బాబాసాహెబ్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, సాంబశివరెడ్డి, జలగం చంద్రయ్య, తల్లూరి ప్రదీప్, నీరుడు యాదగిరి, స్వామి, కురుమూర్తితో పాటు పలువురు దళిత సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.