|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:02 PM
బంగారం కొనాలంటేనే సామాన్యుడు భయపడే రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ. 1.6 లక్షల వద్ద ఊగిసలాడుతుండగా, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది చివరకల్లా పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 2.2 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.గడిచిన రెండు దశాబ్దాల కాలాన్ని గమనిస్తే పసిడి ధరలు పెరిగే వేగం ఊహాతీతంగా మారింది. 2007లో 10 గ్రాములు రూ. 10 వేలు ఉన్న ధర, అది రెట్టింపు కావడానికి (రూ. 20 వేలు) నాలుగేళ్లు పట్టింది. కానీ, రూ. 80 వేల స్థాయి నుంచి ఇప్పుడున్న రూ. 1.6 లక్షలకు చేరడానికి కేవలం రెండేళ్ల కాలం సరిపోయింది. అంటే పెరుగుదల రేటులో వేగం భారీగా పెరిగింది. 2026 ప్రారంభమైన ఈ 26 రోజుల్లోనే పసిడి ఏకంగా 18 శాతం ఎగబాకడం గమనార్హం.