|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 02:46 PM
కరీంనగర్ లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి, భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమని, అభివృద్ధికి నాంది అని కొనియాడారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మేధస్సుతో రూపొందించబడిన రాజ్యాంగం ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, ప్రజాస్వామ్య ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని, కులమత బేధాలు లేకుండా సమాన అవకాశాలు కల్పిస్తుందని, పౌరుల హక్కులకు రక్షణ కల్పిస్తుందని, శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలను సక్రమంగా నడిపిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వర్తించి దేశ ప్రగతికి చేయూతనివ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.