|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:04 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేగవంతం చేశారు. గత కొంతకాలంగా సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితమైన 'తెలంగాణ జాగృతి'ని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఢిల్లీ వెళ్లిన జాగృతి ప్రతినిధులు ఇప్పటికే ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం మరో మూడు నెలల్లో పార్టీకి అధికారిక గుర్తింపు లభించే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగితే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే కవిత తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను ఏకం చేయడమే లక్ష్యమని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు.