![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 06:12 PM
మిర్యాలగూడలోని ప్రభుత్వ గ్రంథాలయంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భోజన కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఉద్యోగాల కోసం చదువుకుంటున్న యువకులు, విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. వేసవికాలం మూడు నెలల పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చి వచ్చేవారు మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇబ్బంది పడకూడదని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.