![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 06:10 PM
ఉమ్మడి పాలమూరు పరిధి మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల ప్రజలు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా వనపర్తి జిల్లా కొత్తకోటకు చెందిన వ్యక్తి సైబర్ మోసగాళ్ల వలలో చిక్కాడు. టెలిగ్రామ్ యాప్‌లో ఓ గ్రూప్‌లో యాడ్ చేసి, అందులో డబ్బులు పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తాయని ఆశచూపగా రూ.70 వేలు పెట్టి మోసపోయాడు. బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.