![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 08:35 PM
తెలంగాణలో ఎండిన పంటలు, అందని కరెంటు, సాగునీరు, కాలిపోతున్న మోటర్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీ, మండలిలో పోరాడాలని BRS నేతలకు గులాబీ బాస్ కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
'BC, SC రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలి. గురుకుల స్కూళ్ల నిర్వీర్యం, ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, మహిళలకిచ్చిన వాగ్ధానాలు, 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిలదీయాలి' అని సూచించారు.