![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:33 PM
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లో 18వ రోజు మంగళవారం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సాయంత్రం రోబోస్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టిబీయం కటింగ్‌లో రైల్వే సిబ్బంది నిమగ్నమైంది. D1, D2 లో మృతదేహాల ఆచూకీ కోసం ర్యాట్ మైనర్స్, సింగరేణి కార్మికులు త్రవ్వకాలు జరుపుతున్నారు. గల్లంతు అయిన కార్మికులను గుర్తించడంలో పురోగతి కనిపిస్తోంది. స్నిపర్ డాగ్స్ కార్మికుల ఆనవాళ్లను గుర్తించాయి. జీపీఆర్ అలాగే డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో రెస్క్యూ టీమ్ తవ్వుతున్నారు.