![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:32 PM
టీవీ సీరియల్స్ చూడొద్దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలకు సూచించారు. నేటి సమాజంలో మంచిని పరిచయం చేయాల్సిన టీవీ సీరియల్స్ నేరాలు ఎలా చేయాలో చూపించే పరిస్థితి ఏర్పడిందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హమాలీ శ్రీను ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమావారం మల్లాపూర్ డివిజన్‌లో మహిళలకు చీరల పంపీణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కవిత మహిళలకు చీరలు పంపిణీ చేశారు.