![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:33 PM
ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫరీక్షా ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ప్రతీ ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తించేలా చట్టానికి రూపకల్పన చేయాలని అన్నారు. అప్పటి వరకు ఎటువంటి నియమాకులు చేపట్టొదని, అలా కాకుండా ముందుకు వెళితే కాంగ్రెస్ పార్టీ రాజకీయ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.సోమవారం గ్రూప్ 1, 2, 3 ఫరీక్షా ఫలితాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరై మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తామని ఆగస్టు 1న అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3, హెచ్‌డబ్యూఓ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ మొదలగు అన్ని ఉద్యోగ ఫలితాలను నిలిపి వేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయని, తర్వాత శాంతియుత ధర్నాలు. రాస్తారోకోలు, తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామన్నారు. రిలే దీక్షల్లో తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పృథ్వీరాజ్‌యాదవ్, తెలంగాణ విఠల్, సయ్యద్, ఇస్మాయిల్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్, గజ్జెల రాజశేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు పాల్గొన్నారు.