![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 05:27 PM
నారాయణపేట పట్టణంలోని కూడలిలో ప్రయాణికులకు ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు దొంగతనాలపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
అపరిచిత వ్యక్తులకు బ్యాంకు ఖాతా, ఎటిఎం, ఓటిపి తదితర వివరాలు చెప్పకూడదని అన్నారు. దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తీసుకోకూడదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.