![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 03:38 PM
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, గవర్నర్ ప్రసంగంతో తమకు సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. గడిచిన డిసెంబర్‌లో మొదటి సారి గవర్నర్ ప్రసంగంలోని అంశాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం తెచ్చే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై మాట్లాడాలన్నారు. అంతకు ముందు కాళేశ్వరం మీద అఖిల పక్షం టూర్ పెట్టారని.. ఇప్పుడు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని అన్నారు.