![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:30 PM
జూనియర్ లెక్చరర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపడుతున్న జూనియర్ లెక్చరర్లకు ఆయన అభినందనలు తెలిపారు.
కొత్త అధ్యాపకులు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించాలని సూచించారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిందని గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో నిరుద్యోగులు క్రియాశీల పాత్ర పోషించారని సీఎం పేర్కొన్నారు.