![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 04:32 PM
హాస్టల్ మెస్ కర్రీలో రేజర్ బ్లేడ్ వచ్చిందంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులు మంగళవారం రాత్రి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని న్యూ-గోదావరి హాస్టల్ విద్యార్థులు రేజర్ బ్లేడ్ వచ్చిందంటూ కూర గిన్నెతో రోడ్డుపై బైఠాయించారు. వైస్ ఛాన్సలర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.రాత్రి భోజనం చేస్తుండగా రేజర్ బ్లేడ్ కనిపించిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నాణ్యమైన ఆహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.విషయం తెలియగానే విచారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారి ఒకరు తెలిపారు.