![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 02:27 PM
ఈ నెల 23-03-2025 తేదీ గచ్చిబౌలి లో జరుగనున్న ముదిరాజ్ సమర భేరి సభను విజయవంతం చేయాలని గౌరవనీయులు నీలం మధు ముదిరాజ్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశమై, యావత్ తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక ఆహ్వానం అందజేశారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ గారు మాట్లాడుతూ, ముదిరాజ్ సామాజిక, రాజకీయ హక్కుల సాధన కీలకమని, పేర్కొన్నారు. ముదిరాజ్ సామాజిక స్థాయిని మరింత పెంచి, యువతను నాయకత్వ పాత్రల్లోకి తీసుకురావాలన్న ఆశయంతో ముదిరాజ్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఈ సభ ఒక పెద్ద మైలురాయిగా నిలుస్తుందని వివరించారు.కాబట్టి, తెలంగాణవ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ బంధువులు, నాయకులు, యువత, మహిళలు ఈ సభలో అధిక సంఖ్యలో పాల్గొని, మన హక్కుల సాధన కోసం సంఘటితమై ముందుకు రావాలని ఆయన కోరారు.