![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 11, 2025, 10:01 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు ఈ నెల 31 లోగా ఎల్ఆర్ఎస్ ను చెల్లించిన వారికి 25% రిబేటు ఇస్తున్న విషయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా పెద్ద ఎత్తున అవగాహన.
కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై లైసెన్స్ టెక్నికల్ ప్లానర్లు, లే ఔట్ ఓనర్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రైటర్లతో సమావేశం నిర్వహించారు.