![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 08:11 PM
సుల్తానాబాద్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. గురువారం తమకు పక్కాగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పెద్దపల్లి మండలం బండారి కుంట, సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ సిబ్బందితో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలో నిల్వ ఉన్న 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం, పెద్దపల్లిలోని బండారి కుంట వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకున్నామన్నారు. 65 క్వింటాళ్ల రేషన్ బియ్యంతోపాటు ఆ బియ్యం తరలించడానికి ఉపయోగిస్తున్న ఆటో సీజ్ చేశామన్నారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి, ఆటోను పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు.వాహనం యజమాని, డ్రైవర్, అక్కడ పని చేస్తున్న ఇతర కార్మికులపై తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు- 2016 ప్రకారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని రాజేందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహశీల్దార్లు రవీందర్, మహేష్ కుమార్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు