![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:51 AM
తెలంగాణ కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా చేపట్టిన సర్వేలా కాకుండా పక్కాగా లెక్కలతో పకడ్బందీగా సర్వే నిర్వహించామని పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర సర్వేను చూసి దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయన్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో తమ అధినేత రాహుల్ గాంధీ కూడా దేశవ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేశారని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ప్రభుత్వం బీసీ డెడికేటేడ్ కమిటీ వేసి ఎక్కడా భవిష్యత్ లో ఇబ్బందులు రాకుండా సర్వే కొనసాగిందని పేర్కొన్నారు. కులగణనలో 56.36 శాతం బలహీన వర్గాలు ఉన్నట్టుగా తేలిందని తెలిపారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. రూపొందించిన బిల్లు ఆమోదం పొందడంతో తమ జీవితం ధన్యమైనట్టుగా భావిస్తున్నామని తెలిపారు.