|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 11:53 AM
సూర్యపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామం మాజీ సర్పంచ్ చక్రయ్య గౌడ్(61) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిపై గొడ్డలితో దుండగుల దాడి చేశారు. చక్రయ్య గౌడ్ వ్యవసాయ భూమి వద్దకు ఒంటరిగా వెళ్లారు. పనులు చేసుకుంటున్న చక్రయ్యపై ప్రత్యర్థి వర్గం వారు కర్రలతో దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.అయితే హత్యకు పాల్పడిన నిందితుల ఇంటిపై బాధితుడి బంధువుల దాడి చేశారు. దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు. సూర్యాపేట ఏరియా హాస్పిటల్ వద్ద భారీ బందోబస్తు మోహరించారు.