![]() |
![]() |
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 03:59 PM
పని ప్రాంతంలో ఉపాధిహామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండలం గుంటిపల్లి గ్రామంలో పని చేస్తున్న ఉపాధిహామీ కూలీలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
పని ప్రాంతాల్లో టెంట్లు, త్రాగునీరు ఏర్పాటు చేయాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు అందటం లేదని చెప్పారు. పని దినాలు పెంచాలని కోరారు.