![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 27, 2025, 12:37 PM
తెలంగాణ శాసనసభ సమావేశాలు 12వరోజు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సర్కారు రైతు రుణమాఫీ చేయాలని మండలి ఆవరణలో BRS MLCలు గురువారం నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రైతు రుణమాఫీ బోగస్ అంటూ నినాదాలు చేశారు. పాముకాట్లు, ఎలుక కాట్లు, విషాహారంతో వందలాది మంది విద్యార్థులు బలి అవుతున్నారని, రోజుకో పేపర్ లీక్ లతో విద్యార్థులు ఆగమవుతుంటే కాంగ్రెస్ సర్కార్ సోయి లేక నిద్రమత్తులో ఉందని ఆరోపించింది.‘చట్ట సభలు అంటే దేవాలయాలతో సమానం కానీ.. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారు. మేం ఏదైనా మాట్లాడితే.. మా గొంతు నొక్కుతున్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడలన్న సోయిలేదు. రైతులు ఇబ్బంది పడవద్దని కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీలను పక్కన పెట్టింది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో ఉన్నాయి’ అని ఎమ్మెల్సీ షేరీ సుభాష్ రెడ్డి పేర్కొన్నారు.