నేటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారం
by Suryaa Desk |
Mon, Mar 31, 2025, 11:15 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని అధికారులు సోమవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 521.70 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 152.3944 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కుడి కాల్వకు 5088 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 7190 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1300 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.