![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 02:05 PM
తెలంగాణ వాసులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూ ఉపరితలం వేడెక్కడంతోనే ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 2, 3 తేదీల్లో వానల కారణంగా వాతావరణం చల్లబడి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వికారాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, కుమురం భీమ్, వనపర్తి, నిర్మల్, జోగులాంబ గద్వాల్ తదితర జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.