![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 01:54 PM
తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఈద్గాల వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రార్థనలు చేశారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వారు ఈ విధంగా నిరసనను వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకురావాలనుకుంటున్న వక్ఫ్ వ్యతిరేక బిల్లును దేశంలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకునే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రుగొండ, మహ్మద్ నగర్, తిప్పనపల్లి ఈద్గాల వద్ద ఈ మేరకు ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు.