![]() |
![]() |
by Suryaa Desk | Mon, Mar 31, 2025, 08:38 PM
దేశ వ్యాప్తంగా ముస్లింలు ఈరోజు రంజాన్ ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కూడా వరంగల్ లోని ఈద్గాలో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ఈద్గాలు, మసీదులు ముస్లింలతో కిక్కిరిసి పోయాయి. ప్రార్థనల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.