|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:40 AM
నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్మాక్స్ మదర్ డెయిరీ) చైర్మన్‌గా గుడిపాటి మధుసూదన్‌రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదర్ డెయిరీలో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో 14 మంది పాలకవర్గం సభ్యులు ఆయన పేరునే ప్రతిపాదించారు. రైతులకు చెల్లించాల్సిన రూ. 12 కోట్ల పెండింగ్ పాల బిల్లులను పాలకవర్గంలోని ఎవరైనా చెల్లించడానికి ముందుకొస్తే తాను రాజీనామా చేస్తానని మధుసూదన్‌రెడ్డి ప్రకటించగా, డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆ బాధ్యతను స్వీకరించారు. ఈ పరిణామం పాల ఉత్పత్తిదారులలో చర్చనీయాంశమైంది.