|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 10:39 AM
TG: ఆట సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి గ్రామానికి చెందిన గుర్నులే సోనేరావు, మనీషా దంపతుల కుమారుడు అశ్విత్(5) కాలువలో పడి మృతి చెందాడు. సాయంత్రం ఆడుకుంటూ గ్రామ శివారులోని కొమురం భీం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డాడు. గ్రామస్తులు వచ్చి బాలుడిని వేలికి తీశారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.