|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:02 PM
వేములవాడ మున్సిపల్ 12వ వార్డుకు చెందిన రామతీర్థం హరీష్, కృష్ణవేణి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని సూచించారు. గత పదేళ్లలో గత ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని విస్మరించిందని, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.