|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 06:57 PM
TG: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలను విచారించిన దర్యాప్తు అధికారులు.. ఆదివారం ఆ పార్టీ అధినేత కేసీఆర్‍ను ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. దీంతో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపై చర్చ జరుగుతోంది. కాగా త్వరోలోనే ఈ కేసులో సిట్ చార్జిషీట్ దాఖలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించిన సిట్ కేసీఆర్ ను ఏమని పేర్కొనబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ అనుమనితుడా? లేక నిందితుడా ఏం జరగబోతోంది అనేది ఆసక్తిగా మారింది