|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 11:10 AM
జిల్లాలోని చిన్న, మధ్యతరహా సాగునీటి వనరుల గణనను ఈనెల 7వ తేదీలోగా 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్‌లతో పాటు బోర్లు, బావుల వివరాలను క్షేత్రస్థాయిలో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.