|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 03:09 PM
కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యమని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, ఆయన నామినేషన్ కేంద్రంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఉపసంహరణ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు అన్ని భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ పరిశీలనలో టౌన్ సీఐ నరహరి, రూరల్ ఇన్స్పెక్టర్ రామన్, ఎస్ఐలు పాల్గొన్నారు.