|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:32 PM
TG: కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు, కార్యకర్తల నుంచి బిగ్ షాక్ తగులుతోంది. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా, కొత్తగూడెం ఫ్యూన్ బస్తీకి చెందిన 5వ వార్డ్ మాజీ కౌన్సిలర్ తలుగు అనిల్, 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తలుగు శాంత తమ అనుచరులతో కలిసి BRSలో చేరారు. వీరిని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పార్టీలోకి ఆహ్వానించారు.