వైరాలో ఘోర రోడ్డు ప్రమాదం: వ్యాన్ ఢీకొని వృద్ధుడైన పశువుల కాపరి దుర్మరణం
Tue, Feb 03, 2026, 06:34 PM
|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:41 PM
విదేశాలతో వాణిజ్య చర్చలకు సంబంధించి ప్రభుత్వం స్థిరమైన వైఖరితో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాతో చారిత్రాత్మక ట్రేడ్ డీల్ కుదిరిన సందర్భంగా ఎన్డీయే కూటమి సమావేశంలో మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై టారిఫ్ లు విధించడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సుంకాల విషయంలో తమ ప్రభుత్వాన్ని విమర్శలు చుట్టుముట్టాయని గుర్తుచేసుకున్నారు.అయితే, ప్రభుత్వం మాత్రం సహనంతో వేచి ఉందని, దాని ఫలితం ఈ రోజు అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్ తో అనుకూల ఆర్థిక వాతావరణం నెలకొందన్నారు.