|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:40 PM
భారత్, అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం ఈ డీల్ ఖరారైంది. ఈ ఒప్పందంలో భాగంగా, అమెరికాలోకి దిగుమతి అయ్యే భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా పలు అమెరికా ఉత్పత్తులపై సుంకాలను తగ్గించనుంది. ఈ నిర్ణయంతో దేశంలో అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది.ఈ ఒప్పందంతో ముఖ్యంగా టెక్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. ల్యాప్‌టాప్‌లు, ఇతర గాడ్జెట్లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటివి మరింత పోటీ ధరలకు లభించే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ గూడ్స్, గృహోపకరణాల దిగుమతి ఖర్చులు కూడా తగ్గుతాయి. అదే సమయంలో, పప్పు ధాన్యాలు, పాల ఉత్పత్తులు వంటి వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గితే, పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం నుంచి కొంత ఉపశమనం లభించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.