|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 04:42 PM
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ సార్వభౌమాధికారం, ప్రభుత్వ పారదర్శకత, రైతుల ప్రయోజనాలు, ఇంధన భద్రత వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ప్రభుత్వం బదులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటనలు చేయడంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ఒప్పందం వల్ల అమెరికాకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని వారు ఆరోపించారు.ఈ ఒప్పందంపై సంతోషించాల్సింది ఏమీ లేదని కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ అన్నారు. అయన మాట్లాడుతూ, "గతంలో 3-4 శాతంగా ఉన్న టారిఫ్‌ను ఇప్పుడు 18 శాతానికి తగ్గించామని సంబరపడటం ఆశ్చర్యంగా ఉంది. మన దేశానికి సంబంధించిన వాణిజ్య ఒప్పందాల గురించి ట్రంప్ చెప్పడమేంటి? మనం ఇంకా సార్వభౌమ దేశం కాదా? ఏ దేశం నుంచి చమురు కొనాలి, ఎవరితో వ్యాపారం చేయాలో అమెరికా నిర్ణయిస్తుందా? ప్రధాని బదులు ట్రంప్ నుంచి ఇలాంటి కీలక సమాచారం రావడం దేశానికి మంచి సంకేతం కాదు" అని ఆయన వ్యాఖ్యానించారు.