|
|
by Suryaa Desk | Tue, Feb 03, 2026, 02:01 PM
బడ్జెట్ ప్రకటనలను ఉచితాల కోసం మాత్రమే చేస్తారంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఎన్నికల కోసం కాదని, వికసిత భారత్ కోసం కేంద్రం ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు. పీఎం ఆవాస్ కింద తెలంగాణ రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించబడ్డాయని, హైదరాబాద్ రైల్వే హబ్ కాబోతుందన్నారు. మేడారం జాతరకు కేంద్రం 3.70 కోట్లు కేటాయించిందన్నారు. నైనీ బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దగా వల్లే సింగరేణి భ్రష్టు పట్టిందని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కేసీఆర్ మార్చుకున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చుకుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్రానికి పెద్దపీట వేశారని కిషన్‌రెడ్డి తెలిపారు.