|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 10:27 AM
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. చలి తీవ్రత తగ్గి, పగటి ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని, కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో వేడి గాలుల ఉధృతి కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో రానున్న మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని, తెలంగాణలోనూ చలిగాలులు వీస్తున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.అయితే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఒకే రకమైన వాతావరణం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఇంకా చలిగాలుల ప్రభావం కొంతవరకు కనిపిస్తోంది. తెల్లవారుజామున, ఉదయం వేళల్లో ఈ ప్రాంతాల్లో చలి స్వల్పంగా అనిపించవచ్చని, దాంతో పాటు కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశమూ ఉందని హెచ్చరించారు. ఈ కారణంగా వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, ముఖ్యంగా హైవేలు, అటవీ ప్రాంతాల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు