|
|
by Suryaa Desk | Fri, Feb 06, 2026, 12:59 PM
మహిళలకు నెలకు రూ.2,500 పథకంపై, పింఛన్ల పెంపుపై AICC కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గద్వాల జిల్లా అయిజలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత బస్సు పథకాలను అమలు చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ దోపిడీతో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి సరిచేస్తున్నారని అన్నారు. మార్చి తర్వాత పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని, మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందిస్తామని స్పష్టం చేశారు.ఈ మున్సిపల్ ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. తమ పార్టీల కోసం ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రజలకు ఆరు హామీలను ఇచ్చి ఆ హామీలను నెరవేర్చలేదని బిజెపి, బిఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నాయి.