ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులను 5 గంటల పాటు విచారించిన మానవ హక్కుల కమిషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 08:18 PM

ఇటీవల వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో భూసేకరణ సభ హింసాత్మకంగా మారడం తెలిసిందే. రైతులు, గ్రామస్తులు జిల్లా కలెక్టర్ పై దాడి చేశారు. దాంతో రైతులపై పోలీసు కేసులు నమోదు కాగా, అరెస్టయిన రైతులు ప్రస్తుతం సంగారెడ్డి జైలులో ఉన్నారు. కాగా, ఈ వివాదాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్ సీ) సుమోటోగా తీసుకుంది. ఈ క్రమంలో, నేడు సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను కలిసిన ఎన్ హెచ్ఆర్ సీ ప్రతినిధులు విచారణ జరిపారు. ఈ విచారణ కొద్ది సేపటి కిందట ముగిసింది. ఎన్ హెచ్ఆర్ సీ డిప్యూటీ రిజిస్ట్రార్ ముఖేశ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులు, వికారాబాద్ జిల్లా అధికారులు ఈ విచారణలో పాలుపంచుకున్నారు. ఈ మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ దాదాపు 5 గంటల పాటు సాగింది. లగచర్ల కేసులో పూర్తి విచారణ చేపట్టాలని ఎన్ హెచ్ఆర్ సీ నిర్ణయించింది. ఈ విచారణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa