కొన్ని ఇంటి చిట్కాలతో కిడ్నీలో రాళ్లను కరిగించవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఓ స్పూన్ నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమాన్ని 6 నెలలు తీసుకుంటే రాళ్లు కరుగుతాయి. పుచ్చకాయ జ్యూస్, ముక్కల రూపంలో ఎక్కువగా తీసుకోవాలి. ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం, ఖాళీ కడుపుతో దానిమ్మ జ్యూస్, గింజలు తీసుకోవడం, కొత్తిమీరను నీటిలో మరిగించి ఆ రసాన్ని తరచూ తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుందని అంటున్నారు.