పుదీనా ఆకులతో ఊహకందని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కడుపు నొప్పితో బాధపడేవారు పుదీనా ఆకుల రసంలో తేనే కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. పుదీనా కూరను తినడం వల్ల పలురకాల అలెర్జీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నోటి దుర్వాసన పోవాలంటే రోజూ పుదీనా ఆకును తినాలి. పూదీనా ఆకుల పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకుంటే ముఖం కాంతివంతంగా మారి మిలిమిల మెరిసిపోతారు.