భద్రతా కారణాల దృష్ట్యా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు తమ దేశానికి రాకపోతే నష్టపరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ ప్రకటించినా.. ఆతిథ్య హక్కుల పత్రంపై ఇంకా సంతకం చేయలేదు. తాజాగా అహ్మదాబాద్‌లో ఐసీసీ అధికారులతో పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్ మాట్లాడారు.
భద్రతా కారణాల రీత్యా పాక్‌లో ఆడేందుకు భారత్ నిరాకరిస్తే.. స్వతంత్ర భద్రతా సంస్థకు భద్రతను అప్పగించాలని ఐసీసీ సూచించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన లేకుండా అగ్రశ్రేణి జట్లు పాకిస్థాన్‌లో పర్యటించాయని పీసీబీ వర్గాలు తెలిపాయి. భారత జట్టు తమ దేశానికి రాకపోతే ఐసీసీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆసియా కప్ కోసం భారత్ పాకిస్థాన్ వెళ్లాలని నిర్ణయించుకున్న సమయంలో భారత జట్టు శ్రీలంకలో మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే.