దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. నెబ్‌సరాయి ప్రాంతంలో ముగ్గురు కుటుంబ సభ్యులు దారుణ హత్యకు గురయ్యాయి. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దంపతులు, వారి కుమార్తెను చంపి పరారయ్యారు. అయితే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగి వచ్చాడు. రక్తపుమడుగున పడి ఉన్న వారిని చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలి.