ఆరుగురు సెల్ టవర్ బ్యాటరీకు దొంగిలించిన నిందితులను గజ్వేల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరి నుండి 23 సెల్ టవర్స్ బాటరీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 సెల్ ఫోన్స, 1 మోటార్ సైకిల్, 2 టాటా మేజిక్ ఆటోలు, నగదు డబ్బులు 98,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు
1. బదావత్ కృష్ణ, తండ్రి గార్జియా, వయస్సు 48 సంవత్సరాలు, నివాసం లాల్‌గాడి మలక్‌పేట్ గ్రామం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ప్రస్తుత నివాసం రాడగంబల బస్తీదాల్, బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా,
2. బానోతు సతీష్ తండ్రి శ్రీనివాస్, వయస్సు 20 సంవత్సరాలు, నివాసం యెల్లక్కపేట్, కిస్తంపేట, మంచిర్యాల జిల్లా ప్రస్తుత చిరునామా చర్చి కాలనీ, అలియాబాద్ షామీర్‌పేట్.
3. ఇస్లావత్ రమేష్ తండ్రి పరశురాం, వయస్సు 36 సంవత్సరాలు, నివాసం 20-107, ఆర్ కె 5 కాలనీ, నస్పూర్, మంచిర్యాల జిల్లా, ప్రస్తుత నివాసం అలియాబాద్, పిట్టల గూడ దగ్గర, సాయి దగ్గర కృష్ణా థియేటర్,
4. లావుడియా శంకర్, తండ్రి దేశాయ్, వయస్సు: 39 సంవత్సరాలు, నివాసం 26-1-112, రడగంబ బస్తీ, బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా, ప్రస్తుత నివాసం పెద్దమ్మ కాలనీ, షామీర్‌పేట్,
5. దుద్దెడ లింగం తండ్రి రాజయ్య వయస్సు: 47 సంవత్సరాలు, నివాసం కిష్టాపూర్ మేడ్చల్ జిల్లా.( దొంగలించిన బ్యాటరీ లను కొన్న వ్యక్తి),
6. ఒక మైనర్ అబ్బాయి. గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి కేసుల వివరాలు తెలియపరుస్తూ గజ్వేల్ పోలీస్ అధికారులు నిఘా పెట్టి టెక్నాలజీతో చాకచక్యంగా సెల్ టవర్ బాటరీ దొంగతనం నిందితులను పట్టుకున్నారు.
వీరు సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, కుకునూరుపల్లి, ములుగు, పోలీస్ స్టేషన్స్, మెదక్ జిల్లాలోని చేగుంట, శివంపేట్, మనోహరాబాద్, పోలీస్ స్టేషన్స్, సైబరాబాద్ లోని షామీర్పేట్ శంషాబాద్ పోలీస్ స్టేషన్స్, మొత్తం 11 కేసులలో జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించండం జరిగింది. కేసు వివరాలు తెలియపరుస్తూ బదావత్ కృష్ణ మరియు అతని కొడుకు అఖిల్ హైదరాబాద్ లోనే ఉండగా గత నాలుగు నెలల క్రితం అతని బంధువులగు రమేష్, శంకర్, సతీష్ లు హైదరాబాద్ కు పని నిమిత్తం రాగా వారితో సులబంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యం తో గతంలో టవర్ లకు సంబందించిన బ్యాటరీ లను టవర్ ల దగ్గరకు ట్రాన్స్పోర్ట్ చేసేవాడు, అట్టి టవర్ లు ఎవరు లేని ప్రదేశంలో ఉంటాయి. అట్టి బ్యాటరీ లను సులబంగా దొంగలించవచ్చు అని వారికి తెలిపినాడు. అదే విదంగా కృష్ణ మరియు అతని కొడుకు అఖిల్ వారి బంధువులగు రమేష్, శంకర్, సతీష్ లు కలిసి కొందరు కొందరిగా, గజ్వేల్, కుకునూరుపల్లి, ములుగు, మనోహరాబాద్, షామీర్పేట్, శివంపేట్, శంషాబాద్ మరియు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసి దానిని దానిని దుద్దెడ లింగం స్క్రాప్ షాప్ తుర్కపల్లి నందు అమ్మినారు.
చాకచక్యంగా సెల్ టవర్ బాటరీ దొంగతనం నిందితులను పట్టుకున్న గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా, చెట్టుక్రింద ముత్యం రాజు అడిషనల్ ఇన్స్పెక్టర్, ఎం. యాదగిరి రెడ్డి ఎస్సై ఆఫ్ పోలీస్ మరియు ఏఎస్ఐ యాదగిరి, నవీన్ కుమార్, రవి, నరేందర్ మరియు వెంకటేష్ లను పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, అభినందించారు. త్వరలో రివార్డ్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.