గుంటూరు జిల్లాలోని అనంతవరం గ్రామంలో ఓ దంపతులకు ఇద్దరు సంతానం కాగా అందులో రెండో కుమారుడు(11) బడికి వెళ్లనని మారం చేసే వాడు. ఈ క్రమంలో నవంబర్ 12వ తేదీన ఎవరు లేని సమయంలో ఓ గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు చీరను బిగించి మెడకు చుట్టుకున్నాడు.
దీంతో గమనించిన కుటుంబసభ్యులు తలుపులు బద్దలుకొట్టి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిన్నటి వరకు వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.